ప్రేమ వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీశ్, అవంతిక జంటగా ఆర్‌జె సినిమాస్ పతాకంపై జయ బి దర్శకత్వంలో బిఎ రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం గురించి దర్శకురాలు బి జయ మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి చూసేలా చిత్రం రూపొందించామన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిళితంగా రూపొందించిన కథ, కథనాలు ప్రేక్షకులకు నచ్చుతాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఓ అపార్ట్‌మెంట్ నేపథ్యంలో సాగే చిత్రం కమర్షియల్‌గా హిట్టవుతుందని, కజకిస్తాన్‌లో చిత్రీకరించిన పాటలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయన్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినా బాగా నటించారని తెలిపారు. ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందించిన సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ పెద్దస్థాయిలో జరుపుతున్నామని, చిన్న చిత్రమైనా భారీ బడ్జెట్‌తో రూపొందించామని, హైటెక్నికల్ విలువలతో రూపొందించిన సినిమా, గతంలో తాము రూపొందించిన లవ్‌లీ చిత్రంకన్నా విజయవంతం అవుతుందని నిర్మాత బిఎ రాజు తెలిపారు. హిందీ, తమిళ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వస్తుండటమే ఈ చిత్రం విజయంపై అంచనాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సాయికుమార్, ఈశ్వరీరావు, రమాప్రభ, కాశీవిశ్వనాధ్, పృధ్వీ, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, లావణ్య, చాందిని నటించిన చిత్రానికి కెమెరా వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం డిజె వసంత్, నిర్మాత బిఎ రాజు, రచన, దర్శకత్వం జయ బి.