క్రెడిట్ అతనిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎలా ఉన్నా ఫర్వాలేదు. ఫొటో తీసేవాడిదే గొప్ప అంటోంది అందాల గోవా బ్యూటీ ఇలియానా. దాదాపు పదిహేనేళ్లుగా నటిస్తూనే వున్నా, ఇప్పటికీ అందం తరిగిపోకుండా కాపాడుతూ మెరిసిపోతోంది బక్కపల్చని గోవా బ్యూటీ. అవకాశాలు తగ్గుముఖం పట్టినా, ఎప్పటికప్పుడు తన ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ నిబోన్ నేతృత్వంలో చేసిన ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు కనువిందు చేస్తోంది. తాజాగా టూ పీస్ బికినీలో శృంగారాన్ని ఒలకబోస్తూ ఆమె పెట్టిన పిక్స్‌కు మంచి గుర్తింపే వచ్చింది. దాదాపు 24 గంటల్లోపే లక్షలకొద్దీ లైక్స్ వచ్చిపడ్డాయట. గతంలో లేనివిధంగా ఎప్పటికప్పుడు తన అందాలు అభిమానులు మరచిపోకుండా ఇలా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది ఇలియానా. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానా ఇక హాలీవుడ్ వైపు చూస్తోందా? అనిపిస్తోంది ఈ ఫొటోలు చూస్తుంటే. చూద్దాం.. ఆస్ట్రేలియన్ బాయ్‌ఫ్రెండ్ తోడున్నాడు కనుక ఏమో, గుర్రం ఎగరావచ్చు!