ఇప్పుడిక సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో బయోపిక్‌లకు ఆదరణ బాగా పెరిగింది. అందులోనూ బాలీవుడ్‌లో బయోపిక్‌లు లెక్కకుమిక్కిలిగానే వస్తున్నాయి. క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపట్ల ప్రేక్షకులు ఎక్కువ ఆదరణ చూపుతుండటం కూడా వీటి సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చు. ఆ కోణంలోనే బాగ్ మిల్కా బాగ్, దంగల్, మేరికోమ్, ఎమ్‌ఎస్ ధోని వంటి సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. అందుకే ప్రస్తుతం ఇండియాలో మంచి పాపులారిటీ పొందిన టెన్నిస్ క్రీడాకారులపై బయోపిక్స్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే దర్శకుడు అమోల్ గుప్తా సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరొక స్టార్ క్రీడాకారిణి, మొదటిసారి ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున మెడల్ సాధించి భారత ప్రభుత్వంతో అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలుగమ్మాయి పివి సింధుపై బయోపిక్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును స్టార్ నటుడు సోనుసూద్ నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న సినిమాలో సింధు పాత్రను ఎవరు చేస్తారు, డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు ఇంకా ఫైనల్ కాలేదు.