12న వెంకటాపురం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై వేణు మాదికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ- అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించామని, ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు నచ్చుతుందని తెలిపారు. రాహుల్ న్యూలుక్‌లో కనిపిస్తాడని, పాత్రకు తగిన విధంగా చిత్రంలో ఒదిగిపోయాడని వారు తెలిపారు. అద్భుతమైన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చుతుందని, సాయిప్రకాష్ కెమెరా పనితనం హైలెట్‌గా వుంటుందని వారు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, కంటెంట్‌ను నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం సరికొత్తగా వుంటుందని కథానాయకుడు రాహుల్ తెలిపారు. కానె్సప్టెడ్ ఫిలిం జోనర్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఆడియో పెద్ద హిట్ అయిందని దర్శకుడు తెలిపారు. అజయ్, జోగి బ్రదర్స్, శశాంక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాయిప్రకాష్, సంగీతం:అచ్చు, నిర్మాతలు:శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్, కథ, దర్శకత్వం:వేణు మాదిగంటి.