ఇదొక ఐటీ లవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా పాండీరాజ్ దర్శకత్వంలో టి రాజేందర్ రూపొందించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందుతోందని నిర్మాత తెలిపారు. సినిమా వివరాలను మీడియాకు వెల్లడిస్తూ ఐదు పాటలను కెనడాలో కంపోజ్ చేశామని, రీ రికార్డింగ్ హైలెట్‌గా ఉంటుదని అన్నారు. చాలాకాలం తరువాత శింబు ఈ చిత్రంలో సరసుడిగా కనిపిస్తాడని, ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథగా సినిమా ఉంటుందన్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఐటి రంగంలో పనిచేసే యువతీ యువకులమధ్య ప్రేమ భావనలు ఎలా ఉంటున్నాయి? ఎలా ప్రేమించుకుంటున్నారు? చివరికి ఎలా విడిపోతున్నారు? వారికి ప్రేమ పెళ్లివరకూ వెళుతుందా లేదా? అన్న కథనంతో చిత్రం సాగుతుందని, ఇప్పటి యూత్‌కు కనెక్టయ్యేలా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చిత్రాన్ని రూపొందించామని అన్నారు. సత్యం రాజేష్ పాత్ర కడుపుబ్బ నవ్విస్తుందని, శింబు గతంలో నటించిన మన్మథ, వల్లభ చిత్రాలకన్నా ఈ సినిమా విజయవంతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామన్నారు. సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా బాలసుబ్రహ్మణ్యం, ఎడిటింగ్ ప్రవీణ్‌ప్రదీప్, మాటలు, పాటలు, నిర్మాత టి రాజేందర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పాండీరాజ్.