గోకుల కృష్ణుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ సెట్‌లో గత నెల రోజులుగా ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నారు. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే చిత్రాన్ని అత్యంత భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలు రకాల టైటిల్స్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో దేవుడే దిగివచ్చినా, ఇంజనీర్ బాబు, మాధవుడు లాంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్‌ను ఓకె చేసే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఇదివరకే పవన్‌కళ్యాణ్ గోకులంలో సీత, గోపాల గోపాల సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కృష్ణుడి సెంటిమెంట్ పవన్‌కు బాగా కుదరడంతో ఈ టైటిల్‌నే ఓకె చేసేలా ఉన్నారంటూ యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. కీర్తిసురేష్, అనూ ఇమాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాజీ హీరోయిన్ కుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్.