వైశాఖానికి కొత్త టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.జె.సినిమాస్ పతాకంపై లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వైశాఖం’. బి.ఎ.రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలై ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందిస్తున్న వాలిశెట్టి వెంకట సుబ్బారావు చెప్పిన విశేషాలు...

వారే ముఖ్యం
దేవుడిచ్చిన మేధస్సుకంటే దాన్ని ఉపయోగించే అవకాశమిచ్చిన వ్యక్తులే గొప్ప. అటువంటి వ్యక్తులైన రాజు, జయలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చంటిగాడు సినిమా సమయంలో నేను జయతో కలిసి డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఓ పాటను చిత్రీకరించాం. అప్పటికే చంటిగాడు సినిమా విడుదలై నాలుగు వారాలైంది. ఆమె నాపై పెట్టుకున్న నమ్మకంతో ఆ పాటను చూసిన రామోజీరావు, సురేష్‌బాబులు మెచ్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీలోనే సినిమాలు తీస్తారు. అప్పుడు లాబ్‌లు పనిచేయవని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమ మొత్తం డిజిటల్ టెక్నాలజీ ద్వారానే సినిమాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన జయకు థాంక్స్.
అందరికీ నచ్చేలా..
పేరుకు తగ్గట్టుగానే వైశాఖం మంచి ఫీల్ వున్న సినిమా. క్యూట్ లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. కొత్త హీరో హీరోయిన్లు అయినా కూడా వాళ్లెక్కడా బోర్ కొట్టరు. చక్కని కథ, కథనంతో జయ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం నాకు తెలుసు.
అలాంటివారుంటేనే...
సినిమా రంగంలో కొత్త టెక్నాలజీ వాడాలంటే దర్శక నిర్మాతల సహకారం చాలా అవసరం. ఈ విషయంలో చాలామంది నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతుంటారు. దానివల్ల ప్రోత్సాహం ఉండదు. కానీ ఈ సినిమాకు కొత్త టెక్నాలజీ విధానాన్ని వాడడంలో జయ, రాజుల సహకారం మరువలేనిది. ఇలాంటివారు ఉంటేనే మాలాంటి టెక్నీషియన్లకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
కొత్త ఫీల్...
వైశాఖం సినిమా మంచి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ టెక్నికల్ పరంగా చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా కెమెరా విషయంలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలుగుతుంది. దీనికి గింబల్ టెక్నాలజీని వాడాం. టెక్నాలజీ పరంగా జయ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించారు. ఆ విషయంలో ఈ సినిమాకు బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు.
రోబోటిక్స్‌పై...
డిజిటల్ టెక్నాలజీపై నాకు చాలా ఆసక్తి. దీనికోసం చాలా రకాల ప్రయోగాలు చేశాను. ప్రస్తుతం నేను కె.ఎల్. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. రోబోటిక్స్ శాస్తవ్రేత్తను కూడా. కొత్త టెక్నాలజీతో సినిమాలు చేయాలన్నది నా ఆశయం.

-శ్రీ