అభిమాన వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమానులు హద్దులు దాటితే హీరోకు కష్టాలు తప్పవు. స్క్రీన్ వెనుక హీరోయజాన్ని ఎలివేట్ చేసేది అభిమానగణమే అయనా, ఒక్కోసారి శ్రుతిమించే వ్యవహారాల వల్ల ఇబ్బందులు తప్పవు. హీరోల సినిమాల విడుదలైనపుడు అభిమాన సంఘాలు చేపట్టే పాలాభిషేకాలు లాంటి సాత్విక చర్యలే కాదు, జంతుబలులు లాంటి మితిమీరిన హింసా కార్యక్రమాలూ ఇప్పటికే చూశాం. గతంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిపే అభిమాన సంఘాలు, ఇప్పుడు ఆ హద్దులు చెరిపేశాయి. ఏదోవిధంగా గుర్తుంపు సాధించాలన్నట్లుగా వెటకారం, అతి గోలతో అందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయ. ఈ పద్ధతి ఆయా హీరోలకూ నచ్చకున్నా, పరిశ్రమలో స్టేటస్ కోసం తప్పక భరిస్తున్నారు. తాజాగా తమిళంలో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌పై తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. అభిమానులు చేసిన యాగీ, తయారుచేసిన పోస్టర్‌వల్ల ఇబ్బందులు తలెత్తాయ. విజయ్ తాజాగా నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆ వీరాభిమాని తయారుచేశాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తునే ఉన్నాం. విజయ్ చేతిలో త్రిశూలం ధరించి వున్న ఫొటో ఆయన అభిమానులకు ఆనందాన్నిచ్చినా, కొన్ని రాజకీయ పార్టీలకు ఏవగింపు కలిగించింది. త్రిశూలం ధరించిన సదరు హీరో కాళ్లకు బూట్లు వేసుకుని ఉండటంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రిశూలం పట్ల భక్త్భివం చూపించకుండా, కాళ్లకు బూట్లు ధరించి పట్టుకోవడమే ఇక్కడ వివాదాస్పదమైంది. దీంతో హీరో విజయ్‌కు కొత్త తలనొప్పి ఎదురైంది. ఇలా గతంలోనూ తమిళ హీరోలు, తెలుగు హీరోలు అభిమానుల అత్యుత్సాహంవల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. హిందీ హీరో అజయ్ దేవ్‌గన్ దర్శకత్వంలో రూపొందిన శివాయ చిత్రం పోస్టర్‌పైనా ఇలాంటి తలనొప్పే తలెత్తింది. బ్యాక్‌గ్రౌండ్‌లో శివుడి ఆకారాన్ని చూపిస్తూ, బూట్లు వేసుకున్న హీరో చిత్రాన్ని దానిపై కనిపించేలా ప్రచరించడం పెద్ద దుమారమే లేపింది. కనుక హీరోలు తమ అభిమానులను అదుపులో పెట్టాల్సిన అవసరం ఎదురవుతోంది. అలా అభిమానులు హీరోలకు ఇబ్బందులు లేకుండా తమ అభిమానాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి వివాదాలు రావు.

-యు