గాడ్సే తీస్తాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనాలు క్రియేట్ చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా నేర సంబంధ వాస్తవ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తీయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇప్పటికే పలు చిత్రాలతో సంచలనం రేపిన వర్మ మరో ప్రాజెక్టుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారి ఆయన తెరకెక్కించే జీవిత కథ ఎవరిదో తెలుసా! మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సేది కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటీవలే సర్కార్-3 ప్రమోషన్‌లో చెప్పాడు. గాంధీని చంపేటప్పుడు గాడ్సే మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేది. ఆ ఆలోచన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేలా చేసింది. ఇలాంటి చారిత్రక సంఘటనల మూలంగా సినిమాలు తీయాలనే అనుకుంటున్నాను. ప్రస్తుతం గాడ్సేకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని వర్మ వెల్లడించాడు. మరి గాడ్సేతో రూపొందే సినిమా ఎలా ఉంటుందో అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.