ఆసక్తికరంగా వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మక్వాన్ జంట సరికొత్తగా వుందని, సినిమా అంతా ఊహకందని మలుపులతో సరికొత్త కథనంతో ఆసక్తికరంగా సాగడంతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటాపురం చిత్రానికి దాదాపు ఈ మొదటి వీక్ ఎండ్‌కు 97 లక్షల గ్రాస్ కలెక్షన్లు లభించాయని, ఇది తమ సినిమా స్టామినాను తెలుపుతుందని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ తెలిపారు. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై వేణు దర్శకత్వంలో రూపొందించిన ‘వెంకటాపురం’ ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లతో కొనసాగుతోందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇంకా వారు మాట్లాడుతూ- మొదటివారం పూర్తవ్వగానే 92 లక్షల గ్రాస్‌తో వేసవి విజేతగా నిలిచిందని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగే విధంగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోందని, వైజాగ్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా ప్రేక్షకులకు నచ్చుతోందని తెలిపారు. హీరో రాహుల్ కొత్త లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని నటించారని, వైవిధ్యమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు వేణు చిత్రీకరించిన విధానం అందిరికీ నచ్చుతోందని వారు తెలిపారు. సాయిప్రకాష్ కెమెరా పనితనం సినిమాకు హైలెట్‌గా కుదిరిందని, ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభిస్తోందని, రోజురోజుకూ వౌత్ టాక్ పెరిగి కలెక్షన్లు పుంజుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు అన్నారు.