విశ్వనాథ్‌కు 20న ప్రణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్‌ను సన్మానించుకోవడం -తమను తాము గౌరవించుకోవడంగానే తెలుగు దర్శకులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కళాతపస్వి కె విశ్వనాథ్‌ను వరించిన సందర్భంగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, సినీ పరిశ్రమలోని 24 శాఖలు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా సత్కరించనున్నాయి. ‘ప్రణామం’ పేరిట హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమం వివరాలను ఫిలిం ఛాంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలువురు దర్శక నిర్మాతలు, సినీ కార్మికుల సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ ఈనెల 20న సాయంత్రం ‘ప్రణామం’ పేరుతో విశ్వనాథ్‌కు విశిష్ట సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సీనియర్లు పాల్గొంటున్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనన్నారు.