శ్రీవల్ల్లీ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి భారీ సినిమాలకు కథలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీవల్లీ’. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం జూన్ మొదటివారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఆలస్యంగా విడుదల చేయడానికి కొన్ని కారణాలున్నాయి. సినిమాకు పనిచేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. ప్రేక్షకులకు తెలిసినవాడిని నేనొక్కడినే. బాహుబలి-1తో కొంత పేరొచ్చినా, రెండో పార్ట్ విడుదలయ్యాక వచ్చే పేరు ‘శ్రీవల్లి’ చిత్రానికి ఉపకరిస్తుందనే ఆలస్యం చేశాం. అలాగే కొత్త నటీనటులైతే ఎలాంటి ఇమేజ్ ఉండదు కనుక కథకు హెల్ప్ అయ్యే విధంగా వాడుకోవచ్చని వాళ్లను తీసుకున్నాం. ఈ సినిమా అంతా మనసులోని చెడు భావాలను తొలగించడం అనే ప్రయోగం నేపథ్యంలో సాగుతుంది. మనసుని చూడటం, కొలవటం అనే ప్రయోగం. ఈ ప్రయోగంలో పాల్గొన్న అమ్మాయికి తన గత జన్మల జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. ఆ జన్మకు, ప్రస్తుత జన్మకు మధ్య జరిగే ఘర్షణ ఎలా ఉంటుందనేది చూపిస్తాం’ అని వెల్లడించారు. ఈ చిత్రంలో రజత్, నేహాసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమావేశంలో నిర్మాతలు సునీత, రాజకుమార్, చిత్ర హీరో రజత్‌లు పాల్గొన్నారు.