మెగా విఎఫ్‌ఎక్స్ హంగులతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150వ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 ఏకంగా వంద కోట్లు స్పీడ్‌గా రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆ ఊపుతోనే చిరంజీవి తన తరువాతి సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. చిరు 151వ చిత్రం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావచ్చిన సినిమాకు, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. బాహుబలి సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో కేర్ తీసుకునేలా నిర్మాత చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. 1880 నేపథ్యంలో ఈ కథ ఉంటుందని, దానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్ హంగులతో సినిమాను తెరకెక్కిస్తారట. భారీ బడ్జెట్‌తో సినిమా ఉంటుందని, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రం జూన్ చివరిలో సెట్స్‌పైకి రానుందని టాక్.