లవ్వించే.. ఉంగరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటీ మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమా సునీల్ చిత్రాల్లాగే పూర్తిగా నవ్వించేలా ఉంటుందని, త్వరలో విజువల్స్ విడుదల చేయనున్నామని, ఔటాఫ్ కామెడీ కాకుండా కథలో కలిసి వుండేలా ఈ చిత్రంలో నవ్వులు వుంటాయని, త్వరలో జీబ్రాన్ అందించిన పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, నల్లవేణు, అనంత్, జెమిని ప్రసాద్, మణిచందన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం జీబ్రాన్, పాటలు రామజోగయ్య శాస్ర్తీ, రెహమాన్, కెమెరా సర్వేష్ మురారి, మాటలు చంద్రమోహన్ చింతాడ, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, దర్శకత్వం కె క్రాంతి మాధవ్.