పాటల వైశాఖమే.. -పూరి జగన్నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వైశాఖం’ పాటలు సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నాయి. స్వయంగా వైశాఖం ఆఫీస్‌కు వచ్చిన పూరి, పాటలను తిలకించి యూనిట్‌ను అభినందించాడు. ఆర్‌జె సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా జయ బి దర్శకత్వంలో బిఎ రాజు నిర్మిస్తోన్న లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. పాటల ప్రదర్శన అనంతరం దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ దర్శకురాలు జయ ఎప్పుడూ మంచి సినిమాలను తీసి చూపిస్తుంటారని, ఈ చిత్రంలో పాటలన్నింటినీ అద్భుతంగా చిత్రీకరించారన్నారు. వసంత్ అందించిన సంగీతం చిత్రానికి హైలెట్ అవుతుందని ప్రశంసించాడు. కొరియోగ్రఫీ వైవిధ్యంగా సాగిన చిత్రంలో హీరో హీరోయిన్లు హరీశ్, అవంతికలు పోటీపడి ఫుల్ ఎనర్జీతో నృత్యాలు చేశారన్నారు. వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తాను ఆశిస్తున్నానని, పాటల్లో లొకేషన్లు కొత్తగా, రిచ్‌గా ఉన్నాయని, విజువల్ బ్యూటీతో అలరించే చిత్రం తప్పక విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పూరి జగన్నాధ్ జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్టుగా ఉంటుందని, లవ్‌లీ పాటలను చూసి సూపర్‌హిట్ అవుతుందని అన్నారని, అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడం తమకెంతో బలాన్ని ఇచ్చిందని నిర్మాత బిఎ రాజు అన్నారు. జూన్ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. మహేష్‌బాబు విడుదల చేసిన ఆడియో సూపర్‌హిట్ అయిందని, ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని నిర్మాత బిఎ రాజు అన్నారు. వైశాఖం తన మనసుకు దగ్గరైన సినిమా అని, ఈ సినిమా విడుదల కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని కథానాయకుడు హరీశ్ తెలిపారు. సాయికుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.