సాహోకి ఏదీ జోడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి ఘన విజయంతో ఊపుమీదున్న ప్రభాస్, అదే స్పీడ్‌ని తన తరువాతి సినిమాకీ కొనసాగించే పనిలో ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాహో సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడా ఫైనల్ చేయలేదు. మొన్న కత్రినా అన్నారు, ఇప్పుడు శ్రద్ధాకపూర్, దిశా పటాని అంటున్నారు. కాని రెమ్యూనరేషన్ విషయంలోనా లేక ఇంకే కారణాలతో వెనకడుకు వేస్తున్నారో తెలీదు. కాని ఏ ఒక్కరినీ ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్‌ని దిగుమతి చేసుకొని హైప్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సాహో నిర్మాతలకు అక్కడి భామలు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. శ్రద్ధాకపూర్ తన రెమ్యూనరేషన్ 8 కోట్లు చేబితే, దిశాపటాని 5 కోట్లు వరకూ డిమాండ్ చేస్తోందట. దీంతో టాలీవుడ్‌లోని ప్రభాస్‌కు అలవాటైన నటినే జత చేయాలని నిర్మాతలు పునరాలోచన చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఆ అదృష్టం ఎవరికి పట్టనుందో కొద్దిరోజుల్లోనే తెలిసిపోతుంది.