జై.. లవకుశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై లవకుశలో ఎన్టీఆర్ లుక్ ఇదీ. ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆయన బర్త్‌డే రోజున గిఫ్ట్ ఇలా అందింది. ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘జై లవకుశ’ ఫస్ట్‌లుక్‌ను బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. సినిమా మొదలుపెట్టి ఆకర్షణీయమైన టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ఎలాంటి స్టిల్స్ విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో ఆతృత పెరుగుతూ వచ్చింది. మరోపక్క టైటిల్ తప్ప మరెలాంటి విషయాలూ బయటకు రాకపోవడంతో, ఎవరి ఊహమేరకు వాళ్లు కథనాలు అల్లేసుకుంటూ అంచనాలు పెంచేశారు. వీటన్నింటికీ సమాధానంగా ‘జై లవకుశ’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. రెండు గెటప్పుల్లో ఎన్టీఆర్ క్లారిటీగా కనిపించేలా ‘లుక్’ని డిజైన్ చేసి విడుదల చేశారు. ఎన్టీఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతా, ఎన్టీఆర్ ఆర్ట్స్ అకౌంట్ల ద్వారా రెండు ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. రావణాసురుడి కటౌట్ కూడా ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్‌లో చేతులకు బేడీలతో పెద్ద పెద్ద సంకెళ్లతో ఎన్టీఆర్ కనిపించారు. కొత్త హెయిర్ స్టయిల్, కొత్త గెటప్‌లో వైవిధ్యంగా కనిపించేందుకు ప్రయత్నించాడు. సినిమాలో ఇంకెంత వైవిధ్యంగా పాత్రల్ని చూపిస్తాడో చూడాలి.