చిరుకోసం ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. సినిమా కోసం సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట దర్శకుడు సురేందర్‌రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్శింహారెడ్డి కథతో రూపొందనున్న సినిమాకు పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలో స్క్రిప్ట్ చివరి దశకు చేరింది. అయితే బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో చిత్రాన్ని భారీగా నిర్మించాలని, ముఖ్యంగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగా 150 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవడంతోపాటు, గ్రాఫిక్స్ విషయంలోనూ ఎక్కువ కేర్ తీసుకోనున్నారట. ఇక ఈ ప్రాజెక్టులో మెగాస్టార్ సరసన బాలీవుడ్ హీరోయిన్‌ని దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్ లాంటివాళ్ల పేర్లు వినిపించాయి. దాంతోపాటు అటు ప్రియాంకా చోప్రా, ఇటు దీపికా పేర్లూ వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22న సినిమాను ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే చిరు సరసన అనేక మందిని పరిశీలించిన మీదట ఎవరిని ఎంపిక చేస్తారు అన్న విషయంపై ఉత్కంఠత అభిమానుల్లో నెలకొంది. ఏదేమైనా సినిమా ప్రారంభించే సమయానికి చిరు సరసన ఎవరు నటించనున్నారో తేలిపోతుంది.