భయపెట్టే షాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమోఘ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన తారాగణంగా షేరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పివి సత్యనారాయణ రూపొందించిన చిత్రం షాలిని. బుధవారం ఉదయం చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత పివి సత్యనారాయణ మాట్లాడుతూ సినిమాను దర్శకుడు వైవిధ్యంగా రూపొందించారని, సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఎ’ సర్ట్ఫికెట్ లభించిందని, హారర్ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరించిన సినిమా భయపెడుతుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, వచ్చేనెల మొదటివారంలో ప్లాటినమ్ డిస్క్ వేడుక చేసి రెండోవారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. హారర్, థ్రిల్లర్, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన సినిమా, ఆ జోనర్‌ను ఇష్టపడేవాళ్ళకు తప్పకుండా నచ్చుతుందని, హైదరాబాద్, వైజాగ్, గోవాలలో షూటింగ్ చేశామని దర్శకుడు షేరాజ్ తెలిపారు.