రమ్యకృష్ణ మాతంగి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివగామిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, మాతంగిగా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. కన్నన్ తొమరకులమ్ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ మూవీ పతాకంపై మాతంగిగా తెలుగులో విడుదల చేస్తున్నాము. జయరాం, సంపత్, అక్షర కిశోర్, ఓంపురి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ మూవి ఇది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వంశం సీరియల్‌ను నిర్మించిన రమ్య సోదరి వినయ్‌కృష్ణన్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. రితేశ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. రెగ్యులర్ హర్రర్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ నట విశ్వరూపం చూస్తారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.