ఆ సినిమాలో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల తాప్సీ ఈమధ్య వరుస అవకాశాలతో బిజీగా వుంది. ఇప్పటికే క్రేజీ అవకాశాలు అందుకుంటున్న ఈ భామ లేటెస్టుగా నందమూరి బాలకృష్ణ సరసన 100వ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. డిక్టేటర్ సినిమాతో మంచి జోరుమీదున్న బాలయ్య ఇపుడు తన 100వ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే సినిమాలో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది. ‘నేను బాలకృష్ణతో నటించడంలేదు. అసలు ఈ సినిమా గురించి ఎవరూ అడగలేదు కూడా. ఈ వార్తలు ఎవరు పుట్టిస్తారో..?’ అని కామెంట్ చేసింది. దీన్ని బట్టి బాలకృష్ణ తాజా సినిమాలో ముందుగా అనుకున్నట్టే అంజలి నటించే ఛాన్స్ లేకపోలేదు.