నవ్వులో ఇంతుందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటా రవి, మాళవికా మీనన్ జంటగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జయంత్ సి పరాన్జి దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఈ చిత్రానికి సంబంధించిన నాలుగవ పాట ‘ఓ నవ్వులో ఇంతుందా.. ఇంతుందా’ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మణిశర్మ వైవిధ్యమైన బాణీతో రూపొందించిన నాలుగో పాటను నేడు విడుదల చేశామని, త్వరలో ఆడియో విడుదల చేసి జూన్ మొదటివారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందించిన ఈ సినిమాలో విధి నిర్వహణ కోసం తన కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసిన ఎంతోమంది పోలీసు అధికారుల కథలతో డిజైన్ చేయడం జరిగిందని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే అనేక అంశాలు, పది భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని దర్శకుడు తెలిపారు. కథతో లింక్ అయి వున్న యాక్షన్ సన్నివేశాలన్నీ సినిమాలో హైలెట్‌గా వుంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గాయని సాహితీ చాగంటి తదితరులు పాల్గొన్నారు. వినోద్‌కుమార్, పోసాని, వెనె్నల కిశోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా తదితరులు నటిస్తున్నారు.