వాడో.. సూపర్ కాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు జయంత్ సి.పరాన్జి

ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మీనరసింహ వంటి చిత్రాలు అందించిన వైవిధ్యమైన దర్శకుడు జయంత్ సి పరాన్జి. ఈయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘జయదేవ్’. గంటా రవి, మాళవికా రాజ్ జంటగా రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పరాన్జి చెప్పిన విశేషాలు... తమిళంలో హిట్ అయిన సేతుపతి చిత్రం నచ్చడంతో, అందులో ప్రధానమైన కథనం తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి సినిమా రూపొందించాం. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన విధి నిర్వహణలో హీరోయిజాన్ని ఎలా చూపాడన్న కథనమే సినిమా. ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ సినిమాలన్నీ పర్సనల్ కథనాలతో ఉంటాయి. అంకుశం, కర్తవ్యం లాంటి సినిమాలన్నీ అలాంటివే. అన్నిట్లో ఒకే పాయింట్ ఉంటుంది కనుక. ఈ సినిమాలో అలాకాకుండా తన విధి నిర్వహణలో పక్కవారి కోసం పాటుపడే హీరో ఏం చేయగలడు అని సినిమాలో చర్చించాం. రియాలిటీకి దగ్గరగా చిత్రీకరణ ఉంటుంది. ఇందులో హీరో రవి పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపిస్తాడు. మహేష్‌బాబుతో ఓ లవ్ స్టోరీ, ప్రభాస్‌తో ఓ సీరియస్ స్టోరీ చేస్తా. వివరాలు త్వరలో చెబుతాను.