ఎథ్నిక్ శామ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరలో పెళ్లిచేసుకునేందుకు సిద్ధమైంది అందాల భామ సమంత. గత కొంతకాలంగా నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి ఈ మధ్యే నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు వీరి ప్రేమ గురించి టాలీవుడ్ కోడై కూసింది. ఇక అక్టోబర్‌లో పెళ్లిచేసుకుంటారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత కూడా తను చేస్తున్న సినిమాల్ని స్పీడ్ పెంచింది. ప్రస్తుతం రామ్‌చరణ్ -సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్, జూలై వరకు షూటింగ్ పూర్తవ్వాలని చెప్పిందట. దాంతోపాటు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సమంత ప్రస్తుతం ఆ వస్త్రాలను మార్కెట్ చేసే విషయంలో బిజీగా వుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన ఈమె, తాజాగా ఓ మాగజైన్ కోసం చేనేత వస్త్రాల్లో హాట్ ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది. మోడరన్ డ్రెస్సుల్లో ఆకట్టుకున్న సమంత, తాజా లుక్స్ కూడా షాకిస్తున్నాయి. ఏదేమైనా చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించడంలో సమంత ఓ అడుగు ముందుకే వేసింది.