క్రైమ్ కామెడీతో ఎరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటకృష్ణ దర్శకత్వంలో ర్యాండమ్ థాట్స్ పతాకంపై ఆనందరంగ, శేషారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎరుపు’. సుధీర్, ప్రత్యూష జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యమైన కథాకథనంతో స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రం ఇదని, ‘క్షణక్షణం’, ‘స్వామిరారా’ తరహాలో క్రైమ్ కామెడీతోపాటు పలు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. టీజర్ ఫస్ట్‌లుక్‌ను వి.బి.ఎస్.లక్ష్మణ్, హీరో సిద్ధార్థ వారి ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తారని తెలిపారు. భద్రం, అజయ్‌ఘోష్, కృష్ణేశ్వరరావు, భాను, వీరేన్, తంబిదురై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మిరాక్, పాటలు: వనమాలి, వశిష్టశర్మ, స్వేచ్ఛ, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: కుమరన్, శక్తికాంత్ కార్తిక్, నిర్మాతలు: ఆనందరంగ, శేషారెడ్డి.