ఊహించని సంఘటనలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధీ, రవిశంకర్, రఘుముఖర్జీ, సంజన, మకరంద్‌దేశ్‌పాండే, రవికాలె ముఖ్యపాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన 3దండుపాళ్యం2 చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా దండుపాళ్యం-2 చిత్రాన్ని రూపొందించారు. షూటింగ్ పూర్తిచేసుకుని, జూన్‌లో విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఆదివారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. యధార్థ సంఘటనలను ఆధారంగా రూపొందించిన దండుపాళ్యం మూడేళ్ల క్రింద విడుదలై ఘన విజయం సాధించింది. ఆ స్ఫూర్తితో దానికి సీక్వెల్‌గా దండుపాళ్యం-2 చిత్రం నిర్మించాను. తెలుగు, కన్నడ భాషల్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టీమ్ ఎఫర్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. షూటింగ్ పూర్తయింది. జూన్ ప్రథమార్థంలో విడుదల చేస్తామని అన్నారు. హీరోయిన్ పూజాగాంధీ మాట్లాడుతూ నా మొదటి సినిమా మంగారుమలై. ఆ సినిమా తర్వాత దండుపాళ్యం చేస్తున్నాను అనగానే చాలామంది వద్దని అడ్డుచెప్పారు. నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నాకిష్టం. రొటీన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులకు బోర్‌కొట్టేస్తాము. అందుకే ఈ సినిమా చేశాను. సినిమా విడుదలైన తర్వాత చాలామంది అద్భుతంగా చేశావని అభినందించారు. దండుపాళ్యం-2లో లక్ష్మి పాత్ర చేయడం ఆనందంగా వుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ కథను మొదట నా భార్యకు చెప్పాను. తను భయపడి సినిమా చేయ్యొద్దంది. అయినా సరే ధైర్యం చేసి సినిమా చేశాను. నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కానీ విడుదలైన తర్వాత అందరు అభినందించారు. మొదటి సినిమా కంటే ఐదురెట్లు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఊహించినట్టుగా ఉండదు. దీనికి సీక్వెల్‌గా వచ్చే దండుపాళ్యం-3తో కథకు ఫులిస్టాప్ పెట్టేస్తానన్నారు.