ట్రాక్ మార్చిన తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ తమన్నాకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ట్రెండ్ ప్రకారం హర్రర్ ఎంటర్‌టైనర్‌గా అభినేత్రి చిత్రంతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సినిమా భారీ పరాజయంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ కెరీర్‌లో ఊపందుకునేందుకు కాస్త గ్యాప్ ఇచ్చి ట్రాక్ మార్చింది. ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా ప్రస్తుతం కుర్ర హీరోల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా సందీప్‌కిషన్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు కునాల్‌కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కే తెలుగు చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైందట. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో సందీప్‌కు జోడీగా తమన్నా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఆమధ్య తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా అదే పాత్రలో నటిస్తుండగా హీరోగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ నటిస్తున్నాడు. జి.వి.ప్రకాశ్ లాంటి చిన్న హీరో సరసన నటించేందుకు తమన్నా ఆసక్తి చూపడం విశేషం. మొత్తానికి మళ్లీ కుర్ర హీరోలతో మొదలుపెట్టా స్టార్ హీరోలను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుందేమో!