పాటల రాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ ముఖ్యపాత్రలో పన్నారాయల్ దర్శకత్వంలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశోక్ మంద, రాజ్ దళవాయి, టోనీ జున్ను నిర్మిస్తున్న చిత్రం ‘రాక్షసి’. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించి, ఆడియో విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ సీడీని ఆవిష్కరించి తులసీరెడ్డికి అందించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ టైటిల్ బాగుందని, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోందన్నారు. యాజమాన్య మంచి సంగీతం అందించారని అంటూనే, ఆయన తాను చేస్తున్న ‘రారా’ చిత్రానికీ సంగీతాన్ని అందించాడని గుర్తు చేశారు. పూర్ణ నటించిన సినిమాలన్నీ చూశా, మంచి ఆర్టిస్ట్. ఈ చిత్రంలోనూ అద్భుతంగా చేసింది. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ ఒక ఇంట్లో జరిగే హర్రర్ ఎంటర్‌టైనర్ ఇది. ఎమోషన్స్, ఫన్, సస్పెన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సినిమాలో రాక్షసి ఎవరనేది తెలుసుకోవడమే అసలు పాయింట్ అన్నారు.