మరకతమణి అదిరింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా రిషీ మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మరకతమణి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సంగీతం బావుందని, విజయవంతమవ్వాలని కోరుకున్నారు. యూవర్సల్ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులో కూడా చేస్తామని, ముందునుంచే ప్రోత్సహించడంతో ఈ సినిమా వైవిధ్యంగా రూపొందిందని, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు ఎ.ఆర్.కె.శరవణన్ అన్నారు. సంగీత దర్శకుడిగా ఇది తన తొలి చిత్రమని, ప్రతి పాట వైవిధ్యంగా ఉంటూ ఐదు గీతాలు ఈ సీడీలో ఉన్నాయని, పూర్తి స్వేచ్ఛనిచ్చిన దర్శక నిర్మాతల అభిరుచి పాటల్లో వినిపిస్తుందని, సంగీత దర్శకుడు దిబూ నైనస్ థామస్ తెలిపారు. ఓ ఐదుగురి పాత్రలను బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుందని, స్క్రీప్టే సినిమాలో హీరోగా ఉంటుందని, ఇప్పటివరకు సీరియస్ పాత్రలు చేసిన తాను తొలిసారిగా కామెడీ తరహా నటన చేశానని, దర్శకుడి ఆలోచనకు ఈ కథ వైవిధ్యంగా రూపొందిందని, ఆర్.ఆర్. సినిమాకు హైలెట్‌గా ఉంటుందని కథానాయకుడు ఆది పినిశెట్టి తెలిపారు. కార్యక్రమంలో అల్లరి నరేష్, కిశోర్ తిరుమల, కళ్యాణకృష్ణ, సంకల్ప్, తనికెళ్ల భరణి, కోన వెంకట్, నిక్కీ గల్రానీ, రవిరాజా పినిశెట్టి పాల్గొని విశేషాలు తెలిపారు.