సెట్స్‌పైకి వచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, శ్రీవిష్ణు కథానాయకులుగా బాబా క్రియేషన్స్ పతాకంపై ఇంద్రసేన ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన రూపొందిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. షూటింగ్‌లో శ్రీయా శరణ్, సుధీర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కమర్షియాలిటీని మిస్‌కాకుండా వైవిధ్యమైన కథలు చేస్తున్న రోహిత్, శ్రీవిష్ణు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారని, నాలుగు పాత్రల తీరుతెన్నులు ఇప్పటివరకూ ఏ చిత్రంలో ఎక్కడా కనపడని విధంగా ఉంటాయన్నారు. సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ కోణాలను స్పృశిస్తూ వినూత్నమైన మల్టీస్టారర్ కథనంతో క్రైం థ్రిల్లర్‌గా చిత్రం తెరకెక్కుతోందని దర్శకుడు తెలిపారు. సత్యదేవ్, శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి, భద్రం, శశాంక్ వౌళి, రవిప్రకాష్, రాజేశ్వరి, సునీతావర్మ, శశిధర్, ఏడిద శ్రీరాం తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం సతీష్ రఘునాథన్, కెమెరా హిస్టిన్, శేఖర్, నిర్మాత అప్పారావు బెల్లన, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇంద్రసేన ఆర్