పొలిటికల్ నేపథ్యంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమురళి, రచితారామ్ జంటగా చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో ధర్మశ్రీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై మంజునాధ్ నిర్మించిన రథావరం చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత మంజునాధ్ వివరాలు తెలియజేస్తూ- రథావరం అంటే సంస్కృతంలో నమ్మినబంటు అని అర్థం. ఇది యూత్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇలాంటి కథాంశంతో సినిమాలు రాలేదు. కన్నడంలో తొలివారంలోనే 9 కోట్లు వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. కథ విషయానికి వస్తే ఓ మంత్రి దగ్గర పనిచేసే రథావరం ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ముఖ్యమంత్రి కావడం కోసం ఆ మంత్రి రథావరాన్ని చేయకూడని పనిని పురమాయిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? రాథావరం ఎలా రీలైజ్ అయ్యాడు అనేదే కథ. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో హిజ్రాలయొక్క విశిష్టతను చూపించే ప్రయత్నం చేశాం. అసలు హిజ్రాలకు కథకు సంబంధం ఏంటి అనేది ప్రధానాంశం అన్నారు. ఈ చిత్రంలో రవిశంకర్, చరణ్‌రాజ్ నటించారు.