గ్యాంగ్‌స్టర్ సినిమా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాల్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. గత ఏడాది జెంటిల్‌మాన్ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా రూపొందించిన చిత్రం ‘అమీ తుమీ’. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెనె్నల కిశోర్, ఈషా ముఖ్యపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ చెప్పిన విశేషాలు..
అష్టాచమ్మలా
అష్టాచమ్మ తీసిన తరువాత దానికి సీక్వెల్ చేయమని చాలామంది అడిగారు. కానీ భిన్నమైన సినిమాల్ని చేయాలన్న ఆలోచనతో వేరే సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా ఖచ్చితంగా దానికి సీక్వెల్ అవుతుందని భావిస్తున్నా. అలాగని ఆ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను వాడుకోవడం ఇష్టంలేదు.
ఒక్కరోజులో
ఇందులో రెండు ప్రేమ జంటలు ఉంటాయి. వాళ్లమధ్యలోకి శ్రీచిలిపి అనే వ్యక్తి ఎంటర్ అయిన తరువాత పరిణామాలు ఎలా ఉన్నాయి అన్న కానె్సప్టుతో ఒక్కరోజులోనే జరిగే కథ ఇది. ఈ కథ విన్న నిర్మాత నరసింహారావు ఆసక్తి చూపడంతో తెరకెక్కించాం. ఇందులో నటీనటులు చక్కటి నటనను కనబరిచారు. అడవి శేష్ పాత్ర రొమాంటిక్‌గా ఉంటుంది. ఈషాతో ఇంతకుముందే రెండు సినిమాలు చేశాను. మళ్లీ ఆమెతో చేయడానికి కారణం అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ యాసలు సులభంగా మాట్లాడగలదు. కాబట్టి ఆమెను ఎంచుకున్నాను.
జెంటిల్‌మాన్ తరువాత
జెంటిల్‌మాన్ తరువాత చిన్న సినిమా చేశానని అంటున్నారు. నా దృష్టిలో చిన్న పెద్ద అనేది లేదు. ఈ కథను ఐదేళ్ల క్రితమే రాసుకున్నాను. జెంటిల్‌మాన్ తరువాత చైతన్యతో చేద్దామనుకున్నా కానీ కుదరలేదు. కానీ తప్పకుండా చైతన్యతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తా.
తదుపరి చిత్రాలు
ఎప్పుడూ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలే చేయడం బోరుకొట్టింది. కాబట్టి ఈసారి గ్యాంగ్‌స్టర్ సినిమా, ప్యూర్ లవ్‌స్టోరీతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నా.

-శ్రీ