వేగంగా స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతంపైగా పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన కొంత టాకీని ఈనెల 13 నుంచి చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ నాలుగు రోజులపాటు జరగనుందని, దాని తరువాత జూలైలో పాటలని తెరకెక్కిస్తారట. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టీజర్ విడుదలైనప్పటినుంచీ అంచనాలు ఆకాశాన్నంటాయి. అనూహ్యమైన రీతిలో టీజర్ వ్యూస్ పెరిగాయి. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. మహేష్ ఐబి ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి దసరాకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు.