త్వరలో ప్రాజెక్ట్ జెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన తారాగణంగా ఎస్.బి.కె ఫిలింస్ పతాకంపై సి.వి.కుమార్ దర్శకత్వంలో ఎస్.కె.కరీమున్నీసా రూపొందించిన చిత్రం ప్రాజెక్ట్ జెడ్. తమిళంలో విజయవంతమైన మాయావన్ చిత్రానికి అనువాద చిత్రం ఇది. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు ఎస్.కె.బషీద్ మాట్లాడుతూ- ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమా తమిళంలో తెరకెక్కిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా వందశాతం నచ్చుతుందన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని అందిస్తున్నామని, కీలకమైన పాత్రలో జాకీష్రాఫ్ నటన హైలెట్‌గా వుంటుందని తెలిపారు. త్వరలో ఆడియోను కూడా విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు.