ఊపుమీదున్న నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరోల్లో నాగార్జున మంచి ఊపుమీదున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త పంథాతో చిత్రాలను రూపొందిస్తూనే, హీరోగానూ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘మనం’ చిత్రం తరువాత సెలెక్టెడ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. అక్కినేని చివరి సినిమా ‘మనం’ విడుదలకు ముందు, సినిమా సూపర్‌హిట్ అని ప్రకటించి మరీ హిట్టందుకున్నాడు. గత ఏడాది సోగ్గాడే చిన్నినాయన చిత్రానికీ అదే రిపీట్ అయ్యింది. సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలో బంగార్రాజు గెటప్‌తో స్టేజీపై నృత్యం చేసి ఆశ్చర్యపర్చిన నాగ్, సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా ఇదేనంటూ ప్రకటించాడు. అన్నట్టుగానే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. నాగ్‌ది మరీ ఒవర్ కాన్ఫిడెన్స్ అంటూ ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నా, వెటరన్ హీరో మాత్రం తన పంథాను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలోనూ స్టేజీమీద సెంటిమెంట్ స్టెప్పులేసి అభిమానుల్ని ఉత్సాహపర్చిన నాగ్, మళ్లీ హిట్టు అనౌన్స్‌మెంట్‌తో ‘వేడుక’ విజయాన్ని అందుకున్నాడు. ఆయన చెప్పినట్టుగానే తొమ్మిది రోజుల్లోనే దాదాపు 35 కోట్లు వసూలు చేసింది ‘వేడుక’. నాగచైతన్య కెరీర్‌లోనే మంచి విజయంగా నమోదైంది. మనం చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా, సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలకు కళ్యాణకృష్ణ కురసాల దర్శకుడు. అయితే ఈ మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నాగార్జున ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్‌ది హీరో అయ్యారు. ప్రస్తుతం అఖిల్‌తో మరో హిట్ ఇస్తానని నాగ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి విక్రం కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథమీద నమ్మకంతో భారీగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ సారథ్యంలో 12 కోట్లతో సినిమా కోసం తీసిన యాక్షన్ పార్ట్ ప్రేక్షకులకు థ్రిల్ అందించటం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శివ, నినే్నపెళ్లాడుతూ, సిసింద్రీ, సీతారాముల కళ్యాణం చూతమురారండి, సీతారామరాజు, మన్మథుడు, సత్యం, మాస్, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాలను అన్నపూర్ణ స్టూడియో పతాకంపై అందించిన ఆయన, తాజాగా మూడు చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున అటు హీరోగా ఇటు నిర్మాతగా టాలీవుడ్‌లో టాప్ హీరో రేంజ్‌లోనే కొనసాగుతున్నాడు. అఖిల్ సినిమా విడుదలైతే మరిన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాల్సిందే! ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది-2 చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. నాగ్ హీరోగా మరో రెండు చిత్రాలకు కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

-యు