బాలకృష్ణ ‘పైసా వసూల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల నుంచి వస్తోన్న చిత్రానికి ‘పైసా వసూల్’ టైటిల్ ఖరారైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ కథకు యాప్ట్ టైటిల్ పైసా వసూల్ అన్నారు. ఖచ్చితంగా బాలకృష్ణ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా సినిమా ఉంటుందని అన్నారు. బాలకృష్ణతో పని చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని, ఈ సినిమాలో హీరో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడని అన్నారు. బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్‌గా అంటూనే, ఇటీవలికాలంలో సీరియస్ రోల్స్ చేస్తున్న బాలకృష్ణ ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ చేస్తున్నాడంటూ ఆసక్తి పెంచేశారు. అభిమానులకి పండుగేనని అంటూ, చిత్రంలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫారిన్ సాంకేతిక నిపుణులు, ఫైట్ మాస్టర్లు పని చేశారని వివరించారు. నిర్మాత వి ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చెయ్యగానే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి’ అన్నారు. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని, టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పైసా వసూల్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మే 12నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్, పోర్ట్‌సిటీలలో ఇంతవరకు ఎవరూ చెయ్యని లొకేషషన్స్‌లో షూటింగ్ చేస్తున్నామని, ఈనెల 16 వరకు షెడ్యూల్ జరుగుతుందని వివరించారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2.50కి ఫేస్‌బుక్‌లో లైవ్ ఏర్పాటు చేశామని, బాలకృష్ణ, పూరిలు లైవ్‌లో పాల్గొని అభిమానులను ఆనందపరుస్తారన్నారు. బాలకృష్ణ పాల్గొనే ఫస్ట్ ఫేస్‌బుక్ లైవ్ ఇదే. అలాగే విదేశాల నుంచి ఫేస్‌బుక్‌లో లైవ్ జరుపుకునే తొలి తెలుగు సినిమా కూడా ఇదే. భవ్య క్రియేషన్స్ బుక్ పేజీలో ఈ లైవ్‌ని చూడొచ్చని వివరించారు. బాలకృష్ణ 101వ చిత్రంగా రూపొందుతున్న చిత్రంలో శ్రేయ, ముస్కాన్, కైరాదత్తు హీరోయిన్లుగా నటిస్తున్నారన్నారు. చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.