సాహో మొదలెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం నేషనల్‌వైడ్ హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే హాలీడేస్‌ని ముగించుకున్న ప్రభాస్ త్వరలోనే సాహో షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
మరోవైపు హీరోయిన్‌పై అనే్వషణ జరుపుతున్న ఈ యూనిట్ గత రెండు రోజులుగా షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని కొన్ని కీలక లొకేషన్లలో నీల్ నితిన్ పాల్గొనగా సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందులో నీల్ నితిన్ విలన్‌గా నటిస్తున్నాడు. త్వరలోనే ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారట. హై టెక్నికల్ విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను బాహుబలి-2 సినిమాతో విడుదల చేశారు. ఇప్పటికే టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయం త్వరలోనే ప్రకటించనున్నారు.