పాపం రెజీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ భామ రెజీనా. వరుసగా యువ హీరోల సరసన జోడీ కట్టిన ఈమెకు, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఈమధ్య వరుసగా పరాజయాలతో సతమతమవుతున్న రెజీనా నక్షత్రం సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మళ్లీ తన హవా చాటుకోవచ్చని భావించింది. కానీ ఆ సినిమా విడుదల విషయంలో క్లారిటీ రాలేదు. దాంతోపాటు తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నింజామ్ మరిపతిలై చిత్రంలో నటించింది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకోవచ్చని భావించింది. కానీ ఆ సినిమా విడుదల కూడా వాయిదా పడడంతో అటు తెలుగు, ఇటు తమిళ సినిమాల విషయంలో తీవ్ర నిరాశలో వుంది రెజీనా. మరి ఈ సినిమాలు విడుదలైతే తప్ప ఈమెకు అనుకున్న క్రేజ్ దక్కేలా లేదు.