బెల్లంకొండ హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా ఇటీవల రామానాయుడు స్టూడియోలో శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో ప్రారంభమైంది. జగపతిబాబు, రవికిషన్, మధుగురుస్వామి విలన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ఓ బాలీవుడ్ భామను ఎంపిక చేయనున్నారు. భారీ సెట్‌లో ప్రారంభమైన షూటింగ్‌లో సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ.. డిక్టేక్టర్ చిత్రం తర్వాత తన దర్శకత్వంలో డిఫరెంట్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నదని, శ్రీనివాస్‌ను సరికొత్తగా చూపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా రూపొందించడానికి ముందుకు వచ్చామని, భారీ హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం శ్రీనివాస్, శ్రీవాస్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని నిర్మాత అభిషేక్ నామ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: అభిషేక్ నామ, రచన, దర్శకత్వం: శ్రీవాస్.