అదే పెద్ద సర్‌ప్రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మరకతమణి’. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిక్కీ గల్రాని చెప్పిన విశేషాలు..
అడ్వెంచరస్ థ్రిల్లర్
ఈ సినిమా ఒక్క జోనర్‌లో ఉంటుందని చెప్పలేం. ఫ్యామిలీ, కామెడీ, థ్రిల్లర్, అడ్వెంచరస్‌ల నేపథ్యంలో సాగుతుంది. హీరోకి తన ఫ్రెండ్స్‌కి అనుకోకుండా మరకతమణి దొరికితే, ఆ తరువాత వారి జీవితంలో ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలకు సినిమా వుంటుంది.
నా పాత్ర
నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేం. అదే పెద్ద సర్‌ప్రైజ్. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. నాతోపాటు ప్రతి పాత్రా కొత్తగా వుంటుంది. ఇందులో హర్రర్ అంశాలు కూడా వుంటాయి.
తదుపరి చిత్రాలు
త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తాను. ప్రస్తుతం తమిళ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. అవి పూర్తయిన తరువాత తెలుగులోకి వస్తా.

-శ్రీ