ఫేట్ ఔటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గబ్బర్‌సింగ్ హిట్ అయినపుడు శృతిహాసన్ కాల్షీట్లకు డిమాండ్ ఏర్పడింది. అంతకుముందు వరకూ ఆమె నటిస్తే చాలు, ఆ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం జరిగింది. బ్లాక్‌బస్టర్ మూవీగా గబ్బర్‌సింగ్ నిలబడడంతో శృతిహాసన్‌కు ఉన్న మచ్చ కాస్త తొలగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో మంచి అవకాశాలు కొట్టేసినా, ఇప్పుడు మాత్రం తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విచిత్రం. కాటమరాయుడు చిత్రం తరువాత ఒక్క అవకాశం కూడా రాలేదు. బాలీవుడ్‌లో చేసిన ‘బెహన్ హోగీ తేరీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది ఆ చిత్రం. దీంతో హిందీలో కూడా శృతిహాసన్‌కు మార్కెట్ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ సినిమా ఒక్కటే వుంది. మొదట శృతిహాసన్‌కు నటన రాదని అవకాశాలు రాలేదు. ఇప్పుడేమో మంచి టాలెంట్ వుందని తెలిసినా ఆమె నడవడికపై వస్తున్న ఆరోపణలు చూసి అవకాశాలు రావడంలేదు. ఎలాగైతేనేం మొత్తానికి శృతిహాసన్ ఫేట్ ఫేడౌట్ అవనున్నదా?

చిత్రం.. శృతిహాసన్