హద్దులు లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కసారి గుర్తింపు వచ్చిందంటే టాలీవుడ్ నుండి కోలీవుడ్‌కో, మాలీవుడ్‌డో కాకపోతే బాలీవుడ్‌కో ఎగిరిపోయి మరిన్ని అవకాశాలు పట్టేయాలని ప్రయత్నిస్తుంటారు హీరోయిన్లు. కానీ రకుల్‌ప్రీత్‌సింగ్ అందుకు విరుద్ధం. ఎక్కడైతే గుర్తింపు వచ్చిందో, అక్కడ పూర్తి స్థాయి అవకాశాలను అందుకుంటూ మరోవైపు కనె్నత్తి చూడకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదిగింది. సినిమాలన్నీ హిట్ అవ్వడంతో హిట్ హీరోయిన్‌గా నిలబడింది. దానికి తగ్గట్టు తెలుగు భాషను కూడా సులభంగా మాట్లాడుతోంది. అందుకే ఎక్కడికివెళితే అక్కడి వాతావరణానికి తగినట్టుగా ఇమిడిపోతోంది. ఇటీవల రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా సినిమాలో ఆమె పాత్ర ఎలా వుంటుందో అలాగే వచ్చి ప్రమోషన్ చేసింది. ఇదో కొత్త తరహాగా ఆమె చేస్తున్న ఫీట్‌గా భావించవచ్చు. ఎప్పుడైతే సినిమా విడుదలై హిట్ అయిపోయిందో, ఇక ఆ పాత్ర తాలూకు గుర్తులనుండి బయటపడుతోంది. మళ్లీ తాను యధావిధిగా ఎప్పుడు ఎలా వుంటుందో అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మోడరన్ డ్రెస్సుల్లో హవా చాటుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ తరువాతి చిత్రం మహేష్‌బాబుతో నటిస్తున్న ‘స్పైడర్’. ఈ చిత్రంలో ఆమె ఓ డాక్టరుగా నటిస్తోందట. ఈ సినిమా ప్రమోషన్‌కు ఎలా వస్తుందో చూడాలి!