గౌతమ్‌నందా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నందా’. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ- ఇంతకుముందు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కథలు రాసేవాడిని. కానీ ఈ కథలోనే హీరోయిజమ్ ఉంది. మంచి కంటెంట్‌కు సాలీడ్ విజువల్స్ తోడైతే సినిమా ఎలా వుంటుందో ఈ సినిమాతో చూస్తారు. సౌందర్‌రాజన్ అద్భుతమైన ఫొటోగ్రఫి అందించాడు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. గోపీచంద్ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా ఇది. ఇప్పటికే ఆయన గెటప్ కొత్తగా వుందంటూ అభినందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తామన్నారు.