కొత్త సినిమాకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానున్న నేపథ్యంలో పవన్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడట. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి.ఆర్.నేసన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదివరకే పూజా కార్యక్రమాల్ని జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుందట. ఇప్పటికే దర్శకుడు నేసన్ పవన్‌తో చర్చలు జరుపుతున్నాడని, మరోవైపు స్క్రిప్ట్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు ప్రకటిస్తారట. ఈ సినిమాతోపాటు పవన్ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో కూడా ఓ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్న పవన్, ఈలోగా వీలైనంత త్వరగా సినిమాల్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నాడు.