గ్రాఫిక్స్‌తో మెప్పించే అవంతిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాఫిక్ వర్క్‌తో రూపొందించిన ‘అవంతిక’ సినిమాకు అవే పెద్ద ఆకర్షణగా నిలుస్తాయని ఆ చిత్రం దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్ణ ప్రత్యేక పాత్రలో శ్రీ రాజ్ బల్ల దర్శకత్వంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘అవంతిక’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ- భీమవరం టాకీస్‌లో వస్తున్న 90వ చిత్రమిదని, పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని అన్నారు. ‘అరుంధతి’, ‘అమ్మోరు’ ‘రాజుగారి గది’ తరహాలో గ్రాఫిక్స్ వర్క్‌తో కూడుకున్న చిత్రమిదని, ఈ చిత్రంలో 35 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని, 45 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 16న చిత్రాన్ని 170 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ- మంచి మూవీ అని ఓపెనింగ్ రోజునే చెప్పానని, ట్రైలర్స్, పాటలు బాగున్నాయని, ఈ సినిమాకు మంచి లాభాలు రావాలని, పూర్ణ మూవీకి ప్లస్ అయిందని అన్నారు. శ్రీరాజ్ మాట్లాడుతూ- చిన్న సినిమాగా మొదలైనా.. పూర్ణ ఎంట్రీతో హైప్ వచ్చిందని, పూర్ణను డైరెక్ట్ చేయడం గొప్ప అనుభవమని, బాగా నటించిందని అన్నారు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని అన్నారు. పూర్ణ మాట్లాడుతూ- అవంతిక తన డ్రీం రోల్ మూవీ అని అని అన్నారు. ఈ వేడుకలో కోడి రామకృష్ణ, సి.కల్యాణ్, ఎస్.వి.కృష్ణారెడ్డి, మల్కాపురం శివకుమార్, అచ్చిరెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులకు షీల్డ్స్ అందించారు. పూర్ణ, గీతాంజలి, కొబ్బరిమట్ట ఫేం శ్రీరాజ్, షియాజీ షిండే, షకలక శంకర్, ధన్‌రాజ్, అజయ్ ఘోష్, సంపత్, మల్లిక, సత్యప్రియ, విజయకుమార్, సాయి వెంకట్, రవిరాజా బల్ల, గిరిధర్, శివ, స్వామి నటించిన ఈ చిత్రానికి కెమెరా:కర్ణ ప్యారసాని, రమేష్, మాటలు:క్రాంతి సైనా, పాటలు:్భరతీబాబు, శ్రీరామ్, మ్యూజక్:రవిరాజ్ బళ్ళ, ఎడిటింగ్:శివ వై ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీరాజ్ బల్ల.