ప్రేమకు జై?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భామ అంజలికి ఈమధ్య కెరీర్ వెనుకబడిపోయింది. ప్రస్తుతం చేసిన సినిమాలు వరుస పరాజయాల పాలవడంతో అవకాశాలు రావడంలేదు. దాంతో తమిళంలో సినిమాలు చేస్తున్న అంజలి ఈమధ్య హీరో జైతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంపై కోలీవుడ్ కోడై కూసింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లిచేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. దానికితోడు జై, అంజలి ఇద్దరూ కలిసి తిరగడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం జై ప్రేమను అంజలి ఓకె చెప్పినట్లు తెలిసింది. తాజాగా అంజలి పుట్టినరోజు సందర్భంగా ఓ పెద్ద బొకేతోపాటు ఓ ప్రేమలేఖను పంపించాడట. అది చూసిన అంజలి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై అతగాడి ప్రేమకు జైకొట్టిందని తెలిసింది. జై లెటర్‌కు రిప్లైగా నాతో నువ్వు వున్నందుకు థాంక్యూ జె.. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. నా స్పెషల్ డే రోజున ఈ స్పెషల్ మెసేజ్‌కు థాంక్స్ అంటూ జై కొట్టింది.