పదేళ్ల ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకంద, 3కంచె2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ హీరోగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, ఎల్‌ఎల్‌పి పతాకంపై శనివారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కథానాయిక రాశీఖన్నా, హీరో వరుణ్‌తేజ్‌లపై కీరవాణి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ- దర్శకుడు వెంకి మంచి రైటర్ అని, ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారని తెలిపారు. ఓ మంచి సంస్థలో కథానాయకుడిగా నటిస్తున్నందుకు గర్వంగా ఉందని, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని వరుణ్‌తేజ్ తెలిపారు. ఒక లవ్‌స్టోరీలోని పదేళ్ల ప్రయాణాన్ని ఈ చిత్రంలో వైవిధ్యభరితంగా చిత్రీకరిస్తున్నామని, దర్శకుడిగా తనకు ఇది తొలి ప్రయత్నమని దర్శకుడు అట్లూరి వెంకి తెలిపారు. కార్యక్రమంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు.