స్పైడర్.. రెండో టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 3స్పైడర్2 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. లేటెస్టు టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళ హక్కుల విషయంలో బాహుబలిని మించిన రేటుకు అమ్ముడవడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి క్రేజ్ రావడంతో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎక్కువ నిడివితో ఉన్న టీజర్‌ను విడుదల చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.