మనసైనోడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్ నందన్, ప్రియాసింగ్ జంటగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో హెచ్ పిక్చర్స్ పతాకంపై హసీబుద్దిన్ నిర్మిస్తున్న మనసైనోడు చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన మనసైనోడు చిత్రంలో దేశభక్తి కూడా ప్రధానాంశంగా సాగుతుందని, ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి రాసిన పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని, అలాగే మగాళ్ల జీవితంలో ఆడవాళ్లు లేకుంటే ఎలా వుంటుందని భాస్కరభట్ల రాసిన మరో పాట కూడా ప్రధానాకర్షణగా నిలుస్తుందని, ఆరు పాటలతో సుభాష్ ఆనంద్ చక్కని సంగీతాన్ని అందించారు. మంచి మెసేజ్‌ను అందించే ఈ చిత్రంలోని పాటలను ఈనెలో 27న విడుదల చేస్తామని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం:సుభాష్ ఆనంద్, నిర్మాత:హసీబుద్దీన్, దర్శకత్వం:వెంకటేశ్వరరావు.