కొత్త ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఆశించిన స్థాయిలో కెరీర్ ముందుకు సాగకపోవడంతో పాపం రెజీనా కాస్త నిరాశలో ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘నక్షత్రం’ సినిమాలో నటిస్తున్న ఆమె ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. మరోవైపు తమిళంలో కూడా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించింది. ఎస్‌జె సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంతో తన కెరీర్ మళ్లీ కోలీవుడ్‌లో పుంజుకుంటుందని భావించిన ఈమెకు నిరాశే కలిగింది. దానికి కారణం సినిమా అనుకున్న సమయంలో విడుదల కాకుండా వాయిదా పడింది. దాంతో నిరాశగా వున్న రెజీనా ఆశలు మళ్లీ వికసించాయి. కారణం తమిళంలో ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ తన క్రేజ్ పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు తెలుగులో ‘నక్షత్రం’ సినిమా కూడా విడుదలైతే రెజీనాకు పండగే.